పెచ్చరిల్లుతున్న నిరుద్యోగం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వపాలనలో ఉద్యోగ కల్పన మృగ్యమవ్వడంతో నిరుద్యోగిత రేటు పెచ్చరిల్లుతున్నది. ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు అటుంచితే.. లక్షలాది సంఖ్యలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను కూడా భర్తీ చేయడంలో కేంద్రం విఫలమైంది.
- 5% పడిపోయిన ఈపీఎఫ్‌వో కొత్త సబ్‌స్ర్కైబర్లు
- గడిచిన రెండేండ్ల వ్యవధిలో ఇదే కనిష్ఠం
- మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ గణాంకాల్లో వెల్లడి
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వపాలనలో ఉద్యోగ కల్పన మృగ్యమవ్వడంతో నిరుద్యోగిత రేటు పెచ్చరిల్లుతున్నది. ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు అటుంచితే.. లక్షలాది సంఖ్యలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను కూడా భర్తీ చేయడంలో కేంద్రం విఫలమైంది. దీంతో దేశంలో నిరుద్యోగం భారీస్థాయిలో పెరిగిపోయింది. దేశంలో ఉద్యోగ కల్పన లేమిని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) కొత్త సబ్స్రైబర్లకు(పేరోల్ డాటా) సంబంధించిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నవంబర్‌లో సంఘటిత రంగంలో ఉద్యోగాల కల్పన రెండేండ్ల కనిష్ఠానికి చేరిందని ఈ గణాంకాలను బట్టి తెలుస్తున్నది. అక్టోబర్‌లో ఈపీఎఫ్‌వో పోర్టల్‌లో 7,72,084 మంది కొత్త సబ్‌స్ర్కైబర్లు నమో దు కాగా, అది నవంబర్‌లో 5 శాతం మేర పడిపోయి 7,36,015 మంది సబ్‌స్ర్కైబర్లకు పరిమితమైంది. సెప్టెంబర్‌తో పోల్చి చూస్తే రెండు నెలల వ్యవధిలోనే కొత్త సబ్‌స్ర్కైబర్ల సంఖ్య దాదాపు 1.5 లక్షల మేర పడిపోవడం దేశంలో పెచ్చరిల్లిన నిరుద్యోగానికి నిదర్శనం. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రొగ్రామ్ ఇంప్లిమెంటేషన్ డాటా వెల్లడించింది.
- వరుసగా కొత్త సబ్‌స్ర్కైబర్లు తగ్గడం ఇది వరుసగా నాలుగో నెల కావడం విశేషం.
- నవంబర్ నెలలో సబ్స్ర్కైబైర్లెన వారిలో 1.94 లక్షల మంది మహిళలు ఉన్నారు.
- నూతన సభ్యత్వం తీసుకున్నవారిలో 18 ఏండ్ల నుంచి 25 ఏండ్ల లోపు వారు 57.3 శాతంగా ఉండటం విశేషం.
- రాష్ర్టాల వారీగా చూస్తే మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకలో అత్యధిక మంది ఉన్నారు.
ఈపీఎఫ్‌వో కొత్త సబ్‌స్ర్కైబర్లలో తగ్గుదల ఇలా..
నెల కొత్త సబ్‌స్ర్కైబర్లు
- జూలై, 2023 10,81,161
- ఆగస్టు, 2023 9,53,092
- సెప్టెంబర్, 2023 8,91,583
- అక్టోబర్, 2023 7,72,084
- నవంబర్, 2023 7,36,015
- ఆధారం: ఈపీఎఫ్‌వో ఇండియా
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

