న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: భారత్లో 453 మంది సిబ్బందిని తొలగించింది గూగుల్. వీరికి ఈ-మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చింది కూడా. ప్రపంచవ్యాప్తంగా 12 వేల మంది సిబ్బందిని తగ్గించుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నది. వ్యయ నియంత్రణ కోసం అంతర్జాతీయంగా 12 వేల మంది లేదా మొత్తం సిబ్బందిలో 6 శాతం కోత పెట్టునున్నట్లు గత నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే.