న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: దేశీయ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నాయి. ఒకవైపు స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నప్పటికీ మ్యూచువల్ ఫండ్సలోకి పెట్టుబడులు ఆగడం లేదు. జనవరి నెలలో రూ.39,688 కోట్ల పెట్టుబడులు వచ్చాయని యాంఫీ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
కానీ, డిసెంబర్ నెలలో వచ్చిన రూ. 41,156 కోట్ల పెట్టుబడులతో పోలిస్తే 3.5 శాతం తగ్గాయని పేర్కొంది. దీంతో వరుసగా 47వ నెలలోనూ ఫండ్సలోకి పెట్టుబడులు రావడం విశేషం. మిడ్‌క్యాప్ క్యాటగిరిలో రూ.5,148 కోట్లు, స్మాల్‌క్యాప్ క్యాటగిరిలో రూ.5,721 కోట్ల పెట్టుబడులు తరలివచ్చాయి.