
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 28 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌కు చెందిన స్పేస్ స్టార్టప్ ‘స్కైరూట్’ 4.5 మిలియన్ డాలర్లు(రూ.33 కోట్లు) నిధులు సేకరించింది. సిరీస్-బీలో భాగంగా గూగుల్ ఇన్వెస్టర్ రామ్ శ్రీరామ్‌కు చెందిన వెంచర్ క్యాపిటల్ షేర్పాలో వెంచర్ ఇన్వెస్ట్ చేసింది. దీంతో ఇప్పటి వరకు సంస్థ 17 మిలియన్ డాలర్లు నిధులను సేకరించినట్లు అయింది. దేశీయ స్పేస్ స్టార్టప్ సంస్థల్లో అత్యధికంగా నిధులు సేకరించిన సంస్థగా రికార్డు సృష్టించింది.