న్యూఢిల్లీ, నవంబర్ 13: కమ్యూనికేషన్స్ కంపెనీ అవయ..వచ్చే ఏడాది ఉద్యోగుల సంఖ్యను 20 శాతం మేర పెంచుకోబోతున్నది. ప్రస్తుతం సంస్థ లో 1,200 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, వచ్చే ఆర్థిక సంవత్సరం చివరినాటికి ఈ సంఖ్యను 1,500కి పెంచుకోనున్నట్లు కంపెనీ సీఈవో అలన్ మసారేక్ తెలిపారు. కొత్తగా తీసుకునేవారిలో డాటా సైంటిస్టులు, కృత్రిమ మేధస్సు విభాగాలకు చెందిన వారిని చెప్పారు. ప్రస్తుతం సంస్థకు ఎయిర్టెల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ), కేంద్ర ప్రభుత్వంలు కీలక క్లయింట్లుగా కొన సాగుతున్నారు. బెంగళూరు, పుణె, హైదరాబాద్, గురుగ్రామ్‌లలో ఉన్న ఆర్ అండ్ డీని మరింత బలోపేతం చేయడానికి ఈ నియామకాలు చేపడుతున్నట్లు తెలిపారు.