2024 TVS Apache RR 310 | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ తన అప్ డేటెడ్ టీవీఎస్ అపాచీ ఆర్ఆర్310 మోటారు సైకిల్ భారత్ మార్కెట్లో ఆవిస్కరించింది. బాంబర్ గ్రే రంగుతోపాటు పలు మార్పులతో వస్తున్న ఈ మోటారు సైకిల్ ధర రూ.2.75 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. రేసింగ్ రెడ్ కలర్ విత్ క్యూఎస్ ధర రూ.2.92 లక్షలు (ఎక్స్ షోరూమ్), న్యూ బాంబర్ గ్రే కలర్ ఆప్షన్ బైక్ రూ.2.97 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. అదనంగా రెండు కిట్స్ డైనమిక్, డైనమిక్ ప్రో కూడా ఆఫర్ చేస్తున్నాయి. డైనమిక్ రూ.18,000, డైనమిక్ ప్రో రూ.16,000 పలుకుతున్నాయి.
2024 టీవీఎస్ అపాచీ ఆర్ఆర్310 మోటారు సైకిల్ 38 బీహెచ్పీ విద్యుత్, 29 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 312.2 సీసీ సిలిండర్, డీఓహెచ్సీ మోటారు కలిగి ఉంటుంది. ఆర్టీడీఎస్సీ కార్నరింగ్ ఏబీఎస్, కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రల్, వీల్ కంట్రోల్, కార్నరింగ్ క్రూయిజ్ కంట్రోల్, రేర్ లిఫ్ట్ ఆఫ్ కంట్రోల్, స్లోప్ డిపెండెంట్ కంట్రోల్, బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్, రేస్ ట్యూన్డ్ డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్), క్రూయిజ్ కంట్రోల్, ట్రాన్స్ పరెంట్ క్లచ్ కవర్, ఎయిరోడైనమిక్ వింగ్ లెట్ తదితర ఫీచర్లు ఉంటాయి.