Hero Destini 125 | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ తన అప్ డేటెడ్ డెస్టిని 125 స్కూటర్ ను ఆవిష్కరించింది. ఆరేండ్ల క్రితం తొలిసారి భారత్ మార్కెట్లో డెస్టినీ 125 స్కూటర్ ఆవిష్కరించింది. ఆల్ న్యూ డిజైన్, పెద్ద వీల్స్, మోడర్న్ అండ్ డైనమిక్ రోడ్ ప్రెజెన్స్ కోసం ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉంటాయి. 124.6 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ తో వస్తోంది. మూడు వేరియంట్లు – వీఎక్స్, జడ్ఎక్స్, జడ్ఎక్స్+ వేరియంట్లలో లభిస్తుంది. ఈ స్కూటర్ ధరలు ఇంకా వెల్లడించలేదు. అన్ని వేరియంట్లలో ప్రొజెక్టర్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, హెచ్-షేప్డ్ ఎల్ఈడీ డే టైం రన్నింగ్ ల్యాంప్, మెటల్ ఫ్రంట్ ఫెండర్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్, రేర్ మోనోషాక్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్ సస్పెన్షన్ ఉంటాయి.
బూట్ ల్యాంప్, సైడ్ స్టాండ్ ఇంజిన్ కటాఫ్, ఎక్స్ టర్నల్ ఫ్యుయల్ ఫిల్లర్, సీబీఎస్, టైప్-ఏ యూఎస్బీ చార్జింగ్ పోర్ట్, 5-లీటర్ల ఫ్యుయల్ ట్యాంక్ ఉంటాయి. డ్రమ్ బ్రేక్స్, సెమీ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ విత్ స్మాల్ ఎల్సీడీ ఇన్ సెట్, 12 అంగుళాల కాస్ట్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. హీరో డెస్టినీ 125 వీఎక్స్ స్కూటర్ గ్రోవీ రెడ్, ఎటర్నల్ వైట్, రీగల్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
హీరో డెస్టినీ 125 జడ్ఎక్స్ వేరియంట్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్, 12 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ కలిగి ఉంటుంది. మెస్టిక్యూ మెజెంటా, కాస్మిక్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. జడ్ఎక్స్ వేరియంట్ స్కూటర్ తో పోలిస్తే జడ్ఎక్స్+ వేరియంట్ స్కూటర్ లో అదనపు ఫీచర్లు ఉన్నాయి. ఫ్రంట్ ఆప్రన్ మీద క్రోమ్ కాపర్ అసెంట్స్, సైడ్ ప్యానెల్స్, రేర్ వ్యూ మిర్రర్స్, టెయిల్ సెక్షన్, 12 అంగుళాల మెషిన్డ్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. జడ్ఎక్స్+ వేరియంట్ స్కూటర్ ఎబోనీ వైట్, రీగల్ బ్యాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.