హైదరాబాద్, సెప్టెంబర్ 7: అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజం వోల్వో..తన రెండో ఎలక్ట్రిక్ వాహనమైన ‘సీ40 రీచార్జ్’ మాడల్‌ను రాష్ట్ర మార్కెట్లోకి విడుదల చేసింది. హైదరాబాద్ షోరూంలో ఈ కారు ధరను రూ.61.25 లక్షలుగా నిర్ణయించింది.
ఈ సందర్భంగా కంపెనీ ఇండియా డైరెక్టర్ కల్పిథ్ సిసోడియా మాట్లాడుతూ..సింగిల్ చార్జ్‌తో 530 కిలోమీటర్ల ప్రయాణించే ఈ కారు కేవలం 4.75 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్నదన్నారు. ఈ కారు గంటకు 180 కిలోమీటర్ల దూరం ప్రయాణించనున్నది. అలాగే బ్యాటరీపై ఎనిమిదేండ్లు లేదా 1.60 లక్షల కిలోమీటర్ల వ్యారెంటీ కల్పిస్తున్నది. ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు కలిగిన ఈ కారులో వైర్లెస్ చార్జింగ్ సదుపాయం కూడా ఉన్నది.