Honda CD110 Dream Deluxe | ప్రముఖ టూ వీలర్స్ తయారీ కంపెనీ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ).. దేశీయ మార్కెట్లోకి 2023 సీడీ110 డ్రీమ్ డీలక్స్ బైక్ రిలీజ్ చేసింది. ఈ బైక్ ధర రూ.73,400 (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. పాత మోడల్ బైక్ ధర రూ.71,133 (ఎక్స్ షోరూమ్) పలికింది. హీరో ఫ్యాషన్, టీవీఎస్ స్పోర్ట్, బజాజ్ ప్లాటినా 110 బైక్‌లతో 2023-హోండా సీడీ110 డ్రీమ్ డీలక్స్ బైక్ పోటీ పడుతుంది.
2023-హోండా సీడీ110 డ్రీమ్ డీలక్స్ బైక్ 109.51 సీసీ, ఓబీడీ2-కంప్లియంట్, పీజీఎం-ఎఫ్ఐ ఇంజిన్‌తో నడుస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 8.68 హెచ్‌పీ విద్యుత్, 9.30 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. 4-స్పీడ్ గేర్ బాక్స్ కలిగి ఉంటుంది.
హోండా స్మార్ట్ పవర్ (ఈఎస్పీ) టెక్నాలజీతో 2023-హోండా సీడీ110 డ్రీమ్ డీలక్స్ ఇంజిన్ రూపుదిద్దుకున్నది. ఏసీజీ స్టార్టర్ మోటార్, ఫ్యూయల్ ఇంజెక్షన్ (పీసీఎం-ఎఫ్ఐ)తో పని చేస్తుంది.
2023-హోండా సీడీ110 డ్రీమ్ డీలక్స్ బైక్ డైమండ్ టైప్ ఫ్రేం కలిగి ఉంటుంది. ఫ్రంట్‌లో టెలిస్కోపిక్ సస్పెన్షన్, రేర్‌లో హైడ్రాలిక్ షాక్స్ ఉంటాయి. 18-అంగుళాల అల్లాయ్ షాడ్ విత్ ట్యూబ్ టైర్స్, రెండు వైపులా 130ఎంఎం డ్రమ్స్ బ్రేక్స్ ఉంటాయి. కాంబీ బ్రేక్ సిస్టమ్ (సీబీఎస్) విత్ యాన్ ఈక్వలైజర్ ఆప్షన్ కూడా ఉంటుంది.
2023-హోండా సీడీ110 డ్రీమ్ డీలక్స్ బైక్ డీసీ హెడ్ ల్యాంప్, ఇన్-బిల్ట్ సైడ్ స్టాండ్ ఇంజిన్ ఇన్హిబిటర్, టూ-వే ఇంజిన్ స్టార్ట్ లేదా స్టాప్ స్విచ్, లాంగ్ సీట్ (720 ఎంఎం), క్రోమ్ మఫ్లర్, ఫైవ్-స్పోక్ సిల్వర్ అల్లాయ్ ఫీచర్‌తో వస్తుంది.
2023-హోండా సీడీ110 డ్రీమ్ డీలక్స్ బైక్ నాలుగు రంగుల్లో లభిస్తుంది. బ్లాక్ విత్ రెడ్, బ్లాక్ విత్ బ్లూ, బ్లాక్ విత్ గ్రీన్, బ్లాక్ విత్ గ్రే రంగుల్లో అందుబాటులోకి వస్తుంది. మూడేండ్ల స్టాండర్డ్, ఏడేండ్ల ఆప్షనల్ వారంటీ ప్యాకేజీ ఇస్తున్నారు.