శనివారం 06 జూన్ 2020
Business - Apr 17, 2020 , 17:00:20

ఇంధన డిమాండ్ 50శాతం డౌన్

ఇంధన డిమాండ్  50శాతం డౌన్

కరోనాను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించటంతో పెట్రోల్‌, డీజిల్‌కు డిమాండ్‌ అమాంతం పడిపోయింది. ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల ప్రకారం ఏప్రిల్‌ 1 నుంచి 15వరకు అన్నిరకాల ఇంధనాలకు డిమాండ్‌ ఏకంగా 50శాతం పడిపోయింది. లాక్‌డౌన్‌ కారణంగా ద్విచక్రవాహనాల నుంచి భారీ ట్రక్కుల వరకు ఎక్కడివక్కడే నిలిచిపోవటంతో ఈ నెల మొదటి అర్థభాగంలో పెట్రోల్‌ వినియోగం 64శాతం తగ్గగా, డీజిల్‌ వినియోగం 61శాతం తగ్గింది. విమాన ఇంధన వినియోగం ఏకంగా 94శాతం పడిపోయింది.

ఈ లాక్‌డౌన్‌ సమయంలో వినియోగం పెరిగిన ఏకైక ఇంధనం వంటగ్యాస్‌ మాత్రమే. పేదలను ఆదుకొనేందుకు ప్రభుత్వం ఉచితంగా కూడ అందించటంతో వంటగ్యాస్‌ వినియోగం ఏకంగా 21శాతం పెరిగింది. ఈ డాటా మూడు ప్రభుత్వ సంస్థలది మాత్రమే. ప్రైవేటు కంపెనీల వ్యాపార వివరాలు కూడా వెలువడితే ఈ లెక్కలు మారిపోయే అవకాశం ఉంది.  


logo