మంగళవారం 31 మార్చి 2020
Business - Mar 24, 2020 , 14:40:42

వ‌ర్క్ ఫ్రం హోం: ఎస్‌బీఐ లైఫ్

వ‌ర్క్ ఫ్రం హోం: ఎస్‌బీఐ లైఫ్

దేశంలో కోవిడ్ -19 అంత‌కంత‌కూ  పెరుగుతుండ‌టంతో అనేక సంస్థ‌లు త‌మ ఉద్యోగుల‌కు ఇంటినుంచి ప‌నిచేసే స‌దుపాయాన్ని క‌ల్పిస్తున్నాయి. ఈ జాబితాలో ఎస్‌బీఐ లైఫ్ కూడా చేరింది. త‌మ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంటి నుంచి ప‌నిచేసే స‌దుపాయాన్ని క‌ల్పిస్తున్న‌ట్లు మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించింది. కార్యాల‌యాల్లో ప‌రిశుభ్ర‌త‌, ఉద్యోగులు, క‌స్ట‌మ‌ర్ల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు సంస్థ ఎండీ సంజీవ్ నాతియాల్ త‌మ ఉద్యోగుల‌కు రాసిన ఈమెయిల్ సందేశాల్లో తెలిపారు. అయితే, ఆఫీసులు తెరిచే ఉంటాయ‌ని, కొద్దిమంది ఉద్యోగులు మాత్ర‌మే ఆఫీసులో విధులు నిర్వ‌హిస్తార‌ని, మిగిలిన‌వారు ఇంటి నుంచే ప‌నిచేస్తార‌ని వెల్ల‌డించారు. క‌స్ట‌మ‌ర్లు త‌మ అవ‌స‌రాల కోసం ఎస్‌బీఐ లైఫ్ డిజిట‌ల్ ప్లాట్‌ఫామ్స్ ఉప‌యోగించుకోవాల‌ని సూచించారు. బాధ్య‌తాయుత‌మైన పౌరులుగా రాష్ర్ట‌, కేంద్ర ప్ర‌భుత్వాల సూచ‌న‌ల‌ను పాటించాల‌ని సంస్థ ఉద్యోగుల‌కు సూచించారు.


logo
>>>>>>