న్యూఢిల్లీ, మే 1 : అమెరికాకు చెందిన ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్..ప్రస్తుతేడాది 20 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్టు ప్రకటించింది. కృత్రిమ మేధస్సుతో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్పై మంచి పట్టున్న ఉద్యోగులను రిక్రూట్ చేసుకోనున్నది. నూతన టెక్నాలజీ సేవలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు, గతేడాది రిక్రూట్ చేసుకున్నవారి కంటే రెండింతలు అధికంగా ఈసారి నియమించుకోనున్నట్టు కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ ఎస్ తెలిపారు. ప్రస్తుతం సంస్థలో 3,36,300 మంది ఉద్యోగులు ఉన్నారు.