Mercedes Benz 300 | జాబిల్లిపైసేఫ్ ల్యాండింగ్‌తో ప్రపంచ దేశాలకు భారత కీర్తి ప్రతిష్టలను చాటి చెప్పింది చంద్రయాన్-3. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగిడిన తొలి దేశంగా అంతరిక్ష పరిశోధనా చరిత్రలో భారత్ పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడేందుకు దోహదంగా మారింది. అంతటి గొప్ప రికార్డు సొంతం చేసుకున్న చంద్రయాన్-3 ప్రయోగానికి అయిన ఖర్చు అక్షరాల రూ.615 కోట్లు.. ఇప్పటి వరకు మార్కెట్లో విక్రయించిన మోస్ట్ కాస్ట్లీ లగ్జరీ కారు.. చంద్రయాన్-3 బడ్జెట్ కంటే దాదాపు రెండింతలు ఎక్కువ అని నివేదికలు వచ్చాయి.
1955 నాటి మెర్సిడెస్-బెంజ్ 300 ఎస్ఎల్ఆర్ ఉహ్లెన్‌హాట్ కూపే (1955 Mercedes-Benz 300 SLR Uhlenhaut Coupe) కారును వేలంలో 143 మిలియన్ డాలర్లకు విక్రయించారు. మన భారత్ కరెన్సీ ప్రకారం దాని విలువ సుమారు రూ.1203 కోట్లు. జర్మనీలోని స్టుట్గార్ట్లోని మెర్సిడెజ్ మ్యూజియంలో ఆర్ఎం సోథెబీస్ నిర్వహించిన ప్రైవేట్ వేలంలో కనీవినీ ఎరుగని ధరకు అమ్ముడైందీ కారు. ఇలాంటి మోడల్ కార్లు ఇప్పుడు రెండే ఉన్నాయట.
వాస్తవంగా లేమాన్స్లో రేసింగ్‌కు మెర్సిడెస్-బెంజ్ ఈ కార్లు తయారు చేసింది. ఈ కార్ల స్రుష్టికర్త పేరే ఈ కారుకు పెట్టారు. ఈ కారు గంటకు 289.6 కిమీ వేగంతో ప్రయాణిస్తుందని సమాచారం. పలు రేసుల్లో వాడిన తర్వాత ఈకారును సెలబ్రిటీల రవాణా కోసం వినియోగించారు.