హైదరాబాద్, ఆగస్టు 16: హైదరాబాద్కు చెందిన టెలికం, సోలార్ ఈపీసీ సేవల సంస్థ బొండాడ ఇంజినీరింగ్ లిమిటెడ్ స్టాక్ మార్కెట్లో లిస్ట్కాబోతున్నది. ఈ నెల 18న ప్రారంభం కానున్న షేర్ల విక్రయం ఈ నెల 22న ముగియనున్నదని తెలిపింది. ఈక్విటీ షేరు ధరను రూ.75గా నిర్ణయించింది. రూ.10 ముఖ విలువకలిగిన 56,96,000 తాజా ఈక్విటీ షేర్లతోపాటు ఆఫర్ ఫర్ సేల్ రూట్లో మరో రూ.42.27 కోట్ల విలువైన షేర్లను విక్రయిస్తున్నది. దీర్ఘకాలికంగా వ్యాపార నిర్వహణకు, బీఎస్ఎన్ఎల్ నుంచి వచ్చిన రూ.1,150 కోట్ల విలువైన ప్రాజెక్టు కోసం ఈ నిధులను సేకరిస్తున్నట్లు కంపెనీ సీఎండీ రాఘవేంద్ర రావు బొండాడ తెలిపారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.370 కోట్లుగా నమోదైన టర్నోవర్, వచ్చే రెండేండ్లలో రూ.1,520 కోట్లకు చేరుకుంటుందన్నారు. అలాగే రూ.18.25 కోట్ల లాభాన్ని గడించింది.