శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Business - Aug 02, 2020 , 00:37:05

ఐదేండ్లలో 12 లక్షల మందికి ఉపాధి

ఐదేండ్లలో 12 లక్షల మందికి ఉపాధి

  • l పీఎల్‌ఐ పథకానికి  22 కంపెనీల దరఖాస్తు
  • l కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 1: ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకం కింద రానున్న ఐదేండ్లలో రూ.11 లక్షల కోట్ల విలువైన మొబైల్‌ ఫోన్లు తయారు కానున్నాయని, దేశం నుంచి దాదాపు రూ.7 లక్షల కోట్ల విలువైన ఫోన్లు ఎగుమతి కానున్నాయని కేంద్ర టెలికం, సమాచార శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. ఇందుకు సంబంధించి యాపిల్‌ ఫోన్లను తయారుచేసే ఫాక్స్‌కాన్‌, పెగాట్రన్‌, విస్ట్రన్‌ కంపెనీలతోపాటు శాంసంగ్‌, లావా, డిక్సన్‌ లాంటి 22 దేశీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి ప్రతిపాదనలు వచ్చినట్టు ఆయన శనివారం వెల్లడించారు. ఈ ప్రతిపాదనలతో రానున్న ఐదేండ్లలో దాదాపు 12 లక్షల మందికి (ప్రత్యక్షంగా 3 లక్షల మందికి, పరోక్షంగా 9 లక్షల మందికి) ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. పీఎల్‌ఐ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు తైవాన్‌, దక్షిణ కొరియా, జర్మనీ, ఆస్ట్రియా తదితర దేశాల కంపెనీలు దరఖాస్తు చేసుకొన్నట్టు చెప్పారు. ఈ పథకం కింద రూ.15 వేలు లేదా అంతకంటే ఎక్కువ ధరలతో కూడిన హ్యాండ్‌సెట్లను తయారు చేయాల్సిందిగా అంతర్జాతీయ కంపెనీలకు నిర్దేశించామని, ధరల విషయంలో దేశీయ కంపెనీలకు మాత్రం ఎలాంటి పరిమితి విధించలేదని మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ వివరించారు.logo