Minister Sridhar Babu | హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): ఆవిష్కర్తలతో పెట్టుబడుదారులను కలిపే సహకార సదస్సు-2024లో 117 ఒప్పందాలు కుదరడం అభినందనీయమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రశంసించారు.
టీ కన్సల్ట్ సంస్థ ఆధ్వర్యంలో టీ హబ్లో ఏర్పాటు చేసిన రెండు రోజుల సదస్సును ఆయన శనివారం ప్రారంభించారు. ఆవిషర్తలు, పెట్టుబడిదారులను కలిపే ఈ కార్యక్రమం అభివృద్ధికి నూతన మార్గాల అన్వేషణకు సహాయ పడుతున్నదని ఈ సందర్భంగా మంత్రి వ్యాఖ్యానించారు.
పాలసీ మేకర్లు, ఆవిషర్తలు, పరిశ్రమ నేతలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి సదస్సు ఏర్పాటులో తీవ్రంగా శ్రమించిన టీ కన్సల్ట్ సంస్థ వ్యవస్థాపకుడు సందీప్ మక్తాలను మంత్రి అభినందించారు. కొత్త ఒప్పందాలతో పారిశ్రామిక ప్రగతి దూసుకుపోనున్నదని మంత్రి ఆశాభావం వ్యక్తంచేశారు.