హైదరాబాద్, మే 18: సిటిజెన్స్ ఫైనాన్షియల్ గ్రూపుతో కలిసి హైదరాబాద్లో కాగ్జిజెంట్ ఏర్పాటు చేసిన గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ భారీగా ఉద్యోగులను నియమించుకున్నది. గడిచిన ఏడాదికాలంలో ఈ సెంటర్లో సిబ్బంది సంఖ్యను 1,000కి పెంచుకున్నట్టు ప్రకటించింది.
భవిష్యత్తులో ఏఐ, క్లౌడ్, డాటా, డిజిటల్ ఇంజినీరింగ్ విభాగాలకు చెందిన వందలాది మందిని నియమించుకోనున్నట్టు తెలిపింది.