న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: నిధులు లేక సతమతమవుతున్న స్టార్టప్‌లను ఆర్థికంగా ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం రూ.10 వేల కోట్లతో ప్రత్యేక ఫండ్‌ను ఏర్పాటు చేయబోతున్నది. ఈ విషయాన్ని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ఢిల్లీలో జరుగుతున్న స్టార్టప్ మహాకుంభ్ 2025 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని, దీంట్లోభాగంగా సిడ్బీ ప్రత్యేకంగా చిన్నస్థాయి స్టార్టప్‌లకు ఆర్థికంగా సహాయ సహకారాలు అందించాలని సూచించారు. స్టార్టప్ వ్యవస్థాపకులు, ఎంటర్ప్రెన్యూర్ల తమ ఆలోచనలు అమలులోకి వచ్చేందుకు సిడ్బీ ప్రత్యేకంగా కృషి చేయాలని, ముఖ్యంగా ప్రతి రాష్ట్రంలో ఒక సెంటర్‌ను నెలకొల్పాలని ఆయన సూచించారు.