న్యూయార్క్, అక్టోబర్ 20: బిట్‌కాయిన్ రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నది. బుధవారం ఈ అదృశ్య కరెన్సీ విలువ 66 వేల డాలర్లు పలికింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 30 వేల డాలర్ల దిగువకు పడిపోయిన ఈ కరెన్సీ విలువ..మళ్లీ ఐదు నెలల తర్వాత రెండు రెట్ల స్థాయిలో ఎగబాకింది. గతంలో ఈ అదృశ్య కరెన్సీ విలువ రికార్డు స్థాయి 64,889 డాలర్లు పలికిన విషయం తెలిసిందే. ఈ అదృశ్య కరెన్సీలో పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు ఎగబడటంతో ఈ క్రిప్టో కరెన్సీ చారిత్రక గరిష్ఠ స్థాయికి చేరుకున్నది.