హైదరాబాద్, మే 9: రాష్ర్టానికి చెందిన బొండాడ ఇంజినీరింగ్ మరో భారీ ప్రాజెక్టును చేజిక్కించుకున్నది. ఎన్టీపీసీ రెన్యూవబుల్ ఎనర్జీ రాజస్థాన్లో నిర్మించతలపెట్టిన 600 మెగావాట్ల సోలార్ పీవీ ప్రాజెక్టు రూ.816 కోట్ల విలువైన ఆర్డర్ పొందినట్టు తెలిపింది.
16 నెలల్లో పూర్తిచేయనున్న ఈ ప్రాజెక్టు పనులను ఈపీసీ పద్దతిన చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టు డిజైనింగ్, ఇంజినీరింగ్, సైట్ అభివృద్ధి, నిర్వహణ బాధ్యతలు కూడా నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొంది.