న్యూఢిల్లీ, మే 9: ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి చెందిన పలు కార్యాలయాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూపు కంపెనీలైన రిలయన్స్ టెలికాం లిమిటెడ్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్లపై నమోదైన కేసులకు సంబంధించి ఆయా కంపెనీల కార్యాలయాలు, డైరెక్టర్ల నివాసాల్లో ఈ సోదాలు జరిపినట్టు సీబీఐ వర్గాలు వెల్లడించాయి.
బ్యాంక్ మోసం చేసిన కేసులో ముంబైలోని ఆయనకు సంబంధించిన 17 సంస్థల్లో సోదాలు నిర్వహించినట్టు సీబీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది దీంట్లో ఒకే చిరునామాతో పలు మధ్యవర్తి కంపెనీలు పనిచేస్తున్నట్టు గుర్తించామని, దర్యాప్తు కొనసాగుతన్నదని పేర్కొన్నారు. దీనిపై ఆయా కంపెనీల ప్రతినిధులు స్పందించడానికి నిరాకరించారు. ముంబైలోని ప్రత్యేక కోర్టు ఇచ్చిన సర్చ్ వారెంట్ ఆధారంగా ఈ సోదాలు నిర్వహించారు.