ముంబై, నవంబర్ 6: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫార్మా కంపెనీ దివీస్ ల్యాబొరేటరీస్ ఈ సెప్టెంబర్ త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.606 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదేకాలంలో నమోదైన రూ.520 కోట్ల లాభంకంటే తాజా క్వార్టర్లో 17 శాతం వృద్ధిచెందినట్టు కంపెనీ శనివారం స్టాక్ ఎక్సేంజీలకు చేసిన ఫైలింగ్‌లో పేర్కొంది. అలాగే దివీస్ మొత్తం ఆదాయం రూ.1,763 కోట్ల నుంచి రూ.2,007 కోట్లకు పెరిగింది. కొవిడ్-19 కారణంగా తమ కార్యకలాపాలకు పెద్ద ఆటంకాలేవీ కలుగలేదని కంపెనీ వివరించింది.