Pimples | యువతలో చాలామంది ఎదుర్కొనే కామన్ సమస్య మొటిమలు. ముఖంపై మొటిమలు వస్తే నలుగురిలోకి వెళ్లేందుకు చాలామంది అమ్మాయిలు వెనుకాడుతుంటారు. ముఖాన్ని స్కార్ఫ్‌తో కప్పేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. మొటిమలు తొందరగా తగ్గిపోయేందుకు రకరకాల క్రీమ్‌లను వాడుతుంటారు. మార్కెట్లో దొరికే కెమికల్ క్రీమ్‌లను వాడే బదులు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మొటిమల సమస్య నుంచి సులువుగా బయటపడొచ్చు. అవేంటంటే..
♥ చాలామంది ఫోన్‌ను ముఖం దగ్గర పెట్టుకొని మాట్లాడుతుంటారు. దీనివల్ల ఫోన్‌కు ఉన్న బ్యాక్టీరియా మన ముఖంపై చేరి మొటిమల సమస్యకు కారణమవుతుంది. ఫోన్‌కు చెమట అంటుకొని అది మళ్లీ ముఖానికి చేరి మొటిమల సమస్య మరింత అధికమవుతుంది. అందుకే ఫోన్ మాట్లాడేటప్పుడు ముఖానికి కాస్త దూరంగా పెట్టుకుని మాట్లాడాలి. వీలైతే ఇయర్ ఫోన్స్ వాడాలి. వీటితోపాటు ఫోన్‌ను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుని మాట్లాడితే కూడా మొటిమల సమస్య ఎదురుకాదు.
♥ చర్మాన్ని అప్పుడప్పుడు స్క్రబ్ చేయడం కూడా ముఖ్యమే. స్క్రబ్ చేయడం వల్ల చర్మంలోని మృతకణాలు తొలగిపోతాయి. దీనివల్ల మొటిమలు రావు. అయితే ఇప్పటికే మొటిమల సమస్యతో బాధపడుతుంటే స్క్రబ్ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే మొటిమలు ఉన్నవాళ్లు స్క్రబింగ్ చేయడం వల్ల చర్మ సమస్యలు మరింత ఎక్కువవుతాయి.
♥ ముఖం కడగడం వల్ల ఫేస్ క్లీన్ అవుతుంది. మొటిమల సమస్య తగ్గుతుంది. అలా అని అతిగా ముఖాన్ని కడగడం కూడా మంచిది కాదు. దీనివల్ల చర్మంలోని సహజ నూనెలు తగ్గి చర్మ సమస్యలు మరింత ఎక్కువ అవుతుంది.
♥ ఆహారపు అలవాట్లు కూడా చర్మ సమస్యలపై ప్రభావం చూపిస్తాయి. జంక్ ఫుడ్ అధికంగా తీసుకుంటే మొటిమలు ఎక్కువవుతాయి. కాబట్టి జంక్ ఫుడ్ తగ్గించి తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. నీటిని ఎక్కువగా తాగాలి.
“Wrinkles | చర్మంపై ముడతలు తగ్గాలా? నిమ్మకాయతో ఇలా చేస్తే సరి!!”