శనివారం 30 మే 2020
Beauty-tips - Mar 15, 2020 , 19:09:29

చీరల్లో మెరిసిన బాలీవుడ్‌ బామలు

చీరల్లో మెరిసిన బాలీవుడ్‌ బామలు

ఫ్యాషన్‌ ప్రపంచంలో మనీష్‌ మల్హోత్రా పేరు తెలియని వారుండకపోవచ్చు. ఆయన డిజైన్‌ చేసిన చీరల్లో బాలీవుడ్‌ సెలెబ్రిటీలు ఇప్పుడు హొయలుపోతున్నారు.  ఈ మధ్యకాలంలో బాలీవుడ్‌ భామలు సీక్వెన్స్‌ చీరల మీద మక్కువ చూపుతున్నట్లుగా అనిపిస్తున్నది. పైగా ఈ చీరలన్నీ మనీష్‌ మల్హోత్రా డిజైన్‌ చేయడం ఇక్కడ విశేషం. జాహ్నవి వంగపండు రంగు చీరను తన ఫ్రెండ్‌ పెండ్లిలో కట్టుకొని మెరిసిపోయింది. స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌, సింపుల్‌ యాక్సెసెరీస్‌ ఆమెను మరింత అందంగా తీర్చిదిద్దాయి.

కాజోల్‌ తానాజీ ప్రమోషన్‌లో భాగంగా బ్లూ కలర్‌ సీక్వెన్స్‌ చీర కట్టింది. కరీనా ఒక సెలెబ్రిటీ ఇంట పెండ్లి రిసెప్షన్‌లో కోరల్‌ సీక్వెన్స్‌ చరీ, మెరిసే బ్లౌజ్‌తో మత్తెక్కించింది. జాక్వెలిన్‌ కాంట్రాస్ట్‌ కాంబినేషన్‌లో యెల్లో, సిల్వర్‌ సీక్వెన్స్‌ చీర కట్టింది. వీళ్లు కాకుండా.. నటాషా, కరిష్మా, దీపికా కూడా ఈ చీరల్లో అందరినీ ఆకర్షించారు.  logo