బుధవారం 03 జూన్ 2020
Beauty-tips - Apr 25, 2020 , 14:49:29

మోచేతులు నల్లబడుతున్నాయా? ఐతే ఇలా చేయండి!

మోచేతులు నల్లబడుతున్నాయా? ఐతే ఇలా చేయండి!

రోజువారీ పనుల నిమిత్తం మనం నిత్యం దుమ్ము, ధూళి, ఎండ, వానల్లో తిరగాల్సి వస్తుంది.  ఐతే చాలామంది నల్లబడ్డ మోచేతులను దాచుకోడానికి ఫుల్‌హ్యాండ్స్ డ్రెస్సులు ధరిస్తుంటారు.   దీనికో సొల్యూషన్ కూడా ఉంది. నల్లబడ్డ మోచేతి భాగాలను ఇంట్లోనే స్వయంగా తిరిగి సాధారణ చర్మంలా మారేలా చేయొచ్చు.

 -శరీరంలోని వేడిని తగ్గించి, శరీరాన్ని చల్లబరిచే గుణం కలబందలో ఉన్నది. కొద్దిగా అలోవేరా జెల్ తీసుకొని నల్లబడ్డ చర్మం మీద రాసి 20 నిమిషాల పాటు అలాగే ఉండనివ్వాలి. 

-ఆ తర్వాత నీటితో శుభ్రంగా కడిగేయాలి. ఇలా రెగ్యులర్‌గా కొన్నిరోజులు చేస్తే నల్లబడ్డ చేతులు తిరిగి మామూలు స్థితికి వచ్చేస్తాయి.

-ఒక వంతు నీరు, మూడు వంతుల బేకింగ్ సోడాతో కలిపి మెత్తటి పేస్ట్ తయారు చేయాలి. రోజుకు రెండుసార్లు నల్లబడ్డ చర్మభాగం మీద రాస్తే కొద్ది రోజుల తర్వాత ఫలితం కనిపిస్తుంది.

-నల్లబడ్డ చర్మాన్ని తిరిగి మామూలు స్థితికి తీసుకురావడానికి కొద్దిగా నిమ్మరసాన్ని ఆ ప్రదేశంలో రాయాలి. 

-కనీసం 10 నుంచి 15 రోజులు ఇలా చేస్తే నల్లబడ్డ చర్మం మాత్రమే కాదు.. మిగతా చర్మం కూడా తాజా నిగారింపును సంతరించుకుంటుంది.

-చక్కెర, ఆలీవ్ ఆయిల్ సమభాగాలుగా రెండింటిని మెత్తగా అయ్యేంత వరకు బాగా కలుపాలి. ఆ పేస్ట్‌ను నల్లబడ్డ శరీర భాగాలకు రాసి 10 నిమిషాల తర్వాత కడిగేయాలి.

-రోజుకోసారి బాదం నూనె చర్మానికి రాస్తే తగిన ఫలితం ఉంటుంది. చర్మానికి మెరుపునిచ్చే గుణాలు బాదం నూనెలో పుష్కలంగా ఉంటాయి.

-ఆలుగడ్డలు ఉడికించి మిక్సీ పట్టాలి. ఆ మిశ్రమాన్ని నల్లబడ్డ శరీర భాగాల మీద రాసి, కొద్దిసేపటికి కడిగేయాలి. 

-ఆలూ చర్మం మీద పేరుకుపోయిన మృతకణాల్ని వేగంగా తొలగించి చర్మానికి నిగారింపును ఇస్తుంది.


logo