Scurf | ఏడాదంతా కాపాడుకున్న సౌందర్యం చలికాలంలో ఆవిరై పోతుంది. చర్మం పొడిబారడం, జుట్టు చిట్లడం, పెదాలకు పగుళ్లు.. ఒకటా రెండా. అన్నీ సమస్యలే. ఉద్యోగినులకైతే చెప్పాల్సిన పనేలేదు. ఈ సమస్యలకు స్కార్ఫ్‌తో చెక్ పెట్టేయవచ్చు. మెడచుట్టూ చుట్టుకునే స్కార్ఫ్ శరీరాన్ని వెచ్చగా ఉంచడంతోపాటు దుమ్ము, ధూళి నుంచి ముఖాన్ని, జుట్టును కాపాడుతుంది. ముక్కు, చెవుల ద్వారా చల్లగాలి శరీరంలోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. రోజువారీ వినియోగానికి నూలు స్కార్ఫ్‌లు, చలికాలానికి ఉన్ని స్కార్ఫ్‌లు బావుంటాయి. ఫ్యాషనబుల్‌గానూ ఉంటాయి. మొజాయిక్ సొగసులు జోడించిన స్కార్ఫ్‌లు కూడా మగువలను మురిపిస్తున్నాయి.
Read More :
చలి తీవ్రంగా ఉన్న ప్రాంతంలో ఎలాంటి కూరగాయలు పండించాలి”
Weight Loss | చలికాలంలో బరువు పెరిగిపోతున్నారా? ఈ టిప్స్ పాటించండి”
“Winter Food | చలికాలంలో ఈ ఫుడ్ తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా”