చలి తీవ్రంగా ఉన్న ప్రాంతంలో ఎలాంటి కూరగాయలు పండించాలి
కూర మిరప (బెంగుళూరు మిర్చి), ఫ్రెంచి చిక్కుడు (బీర్నీసు) లాంటివి శీతకాలం చల్లని వాతావరణానికి అనుకూలమైన పంటలు. రాత్రి అత్యల్ప ఉష్ణోగ్రత 10 నుంచి 17 డి. సెం.గ్రే. మధ్య ఉండే ప్రాంతాల్లో బెంగుళూరు మిర్చి సాగు చేసుకోవచ్చు
కూర మిరప (బెంగుళూరు మిర్చి), ఫ్రెంచి చిక్కుడు (బీర్నీసు) లాంటివి శీతకాలం చల్లని వాతావరణానికి అనుకూలమైన పంటలు. రాత్రి అత్యల్ప ఉష్ణోగ్రత 10 నుంచి 17 డి. సెం.గ్రే. మధ్య ఉండే ప్రాంతాల్లో బెంగుళూరు మిర్చి సాగు చేసుకోవచ్చు. ఇలాంటి వాతావరణం 30 రోజుల పాటు ఉంటే దిగుబడి బాగుంటుంది. కానీ, రాత్రి ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ పూత రాలడం కూడా పెరుగుతుంది. కాయ నాణ్యత దెబ్బతింటుంది. అయితే, చౌడు నేలల్లో ఈ పంటను వేయవద్దు. ఇక ఫ్రెంచి చిక్కుడు కూడా శీతకాల పంటే. అయితే, అధిక మంచు, అధిక ఉష్ణోగ్రతను తట్టుకోలేదు. ఉష్ణోగ్రతలు 15 నుంచి 25 డి. సెం.గ్రే. ఉంటే మొక్క పెరుగుదల బాగుంటుంది. ఇందులో అర్క అనూప్, అర్క కోమల్ వంటి రకాలు సాగు చేసుకొంటే మంచిది. క్షార స్వభావం ఉన్న నేలల్లో ఫ్రెంచి చిక్కుడును సాగు చేయవద్దు. వీటితోపాటు క్యారట్, బీట్రూట్ లాంటి దుంప పంటలనూ శీతకాల పంటలుగా సాగు చేసుకోవచ్చు.
Read Today's Latest Agriculture News in Telugu and Telugu News
- Tags
- agriculture
- crop
- vegetable
- winter
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

