HomeBeauty-tipsDiet Sleep And Care Are Three Factors That Affect Skin Health
నిగారింపు చర్మానికి..
ఆహారం, నిద్ర, సంరక్షణ.. ఈ మూడూ చర్మ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలు. వయసు పెరిగేకొద్దీ చాలామంది చర్మం గురించి పట్టించుకోరు. నిజానికి, నాలుగు పదులు దాటిన తర్వాతే.. మరిన్ని జాగ్రత్తలు అవసరం అవుతాయి. అన్ని వయసులవారికీ ఉపకరించే కొన్ని చిట్కాలు..

మైల్డ్ క్లెన్సర్‌తో రోజుకు రెండు నుంచి మూడుసార్లు మొహం కడుక్కోండి.
వారానికి మూడుసార్లయినా షాంపూతో తలస్నానం చేయండి.
మొహం కడుక్కున్న తర్వాత మీ చర్మతత్వానికి దగ్గరగా ఉన్న మాయిశ్చరైజర్‌ను ఉపయోగించండి.
ఎండలో వెళ్లడానికి ఇరవై నిమిషాల ముందే సన్‌స్క్రీన్ రాసుకోండి.
పడుకునే ముందు మేకప్ తుడిచేసుకోండి.
ఎంత పనిలో ఉన్నా సరే.. మధ్య మధ్యలో నీళ్లు తాగుతూ ఉండండి.
తాజా పండ్లు, కూరగాయలు ఆహారంలో భాగం చేసుకోండి.
వారానికి కనీసం మూడు రోజులు ఏదైనా వ్యాయామం చేయండి.
రోజుకు కనీసం ఏడు నుంచిఎనిమిది గంటల నిద్ర అవసరం.
ఒత్తిడిని మనసులోకి తీసుకోకండి. ధ్యానం, ప్రాణాయామం సాధన చేయండి.