Beauty tips | పొట్ట స్లిమ్‌గా ఉండాలంటే ఈ ఐదింటిని పక్కన పెట్టాల్సిందే..
Health tips | సాధారణంగా అందరూ స్లిమ్‌గా, ట్రిమ్గా ఉండాలని కోరుకుంటారు. యువతలో అయితే ఈ కోరిక మరీ ఎక్కువ. అందుకే పొట్ట తగ్గించుకోవడం కోసం రోజూ
Beauty tips | సాధారణంగా అందరూ స్లిమ్‌గా, ట్రిమ్గా ఉండాలని కోరుకుంటారు. యువతలో అయితే ఈ కోరిక మరీ ఎక్కువ. అందుకే పొట్ట తగ్గించుకోవడం కోసం రోజూ వాకింగ్, జాగింగ్, రన్నింగ్ అంటూ ఎన్నో కసరత్తులు చేస్తుంటారు. ఎంత చేసినా పొట్ట తగ్గడం లేదంటూ నిరాశ చెందుతుంటారు. వాస్తవానికి పొట్ట తగ్గించుకోవాలంటే వ్యాయామం ఒక్కటే సరిపోదు. వ్యాయామంతోపాటు కొన్ని ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవాలి. మరి మార్చుకోవాల్సిన ఆ అలవాట్లు ఏమిటో తెలుసుకుందామా..?
1. ఫాస్ట్ ఫుడ్
ఫాస్ట్ ఫుడ్ అనే మాట వింటే చాలు ఎవరికైనా నోరూరుతుంది. కానీ ఈ ఫాస్ట్ ఫుడ్‌కు ఊబకాయానికి అవినాభావ సంబంధం ఉంటుంది. ఫాస్ట్‌ఫుడ్ తింటే పొట్ట పెరుగుతుంది. అందువల్ల పొట్ట తగ్గాలంటే ఫాస్ట్‌ఫుడ్‌ను పక్కన పెట్టాల్సిందే.
2. చక్కెర
నోటికి తియ్యగా ఉండే ఈ పదార్థం మన శరీరానికి మాత్రం తీవ్ర హాని చేస్తుంది. ఒక కప్పు చక్కెరలో 773 క్యాలరీస్ ఉంటాయి. దీనివల్ల ఊబకాయం రావడమే కాకుండా మధుమేహం వంటి ఇతర రోగాలు కూడా అంటుకుంటాయి. కాబట్టి చక్కెరను కూడా దూరం పెట్టాల్సిందే.
3. ఆలుగడ్డ
అందరికి బాగా నచ్చే కూరగాయ ఈ ఆలుగడ్డ. కానీ ఊబకాయులకు ఈ ఆలుగడ్డ మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఒక ఎగ్ సైజు ఆలుగడ్డలో 163 క్యాలరీలు ఉంటాయట. ఈ క్యాలరీలు పొట్ట పెరుగడానికి కారణం అవుతాయట.
4. కూల్‌డ్రింక్స్
కూల్‌డ్రింక్స్ కూడా ఊబకాయం, లావు పొట్టకు కారణమవుతాయి. 12 ఔన్సుల డ్రింక్‌లో దాదాపు 140 క్యాలరీస్ ఉంటాయి. అందువల్ల నాజూకు పొట్ట కోరుకునే వాళ్లు కూల్ డ్రింక్స్‌కు ఎంత దూరం ఉంటే అంత మంచింది.
5. మరికొన్ని పదార్థాలు
పైన పేర్కొన్న వాటితోపాటు బేకరీ ఫుడ్స్, వేపుళ్లు, స్వీట్లు, చాక్లెట్లు, దుంపలు ఊబకాయానికి, లావు పొట్టకు కారణం అవుతాయి. అందువల్ల వాటిని కూడా దూరం పెట్టాలి. ఫైబర్ ఎక్కువగా ఉండే పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.
Read Today's Latest Beauty-tips News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

