పినపాక : ఇండియన్ టెస్ట్ క్రికెట్ ప్లేయర్ హనుమ విహారి సోమవారం మండలంలోని ఏడూళ్ళ బయ్యారం గ్రామంలో సందడి చేసారు. బయ్యారంలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన హనుమవిహారిని స్థానిక క్రికెట్ క్రీడాకారులు సన్మానించారు. ఈసందర్భంగా విహారి క్రీడాకారులకు క్రికెట్ పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం మణుగూరు భద్రాద్రి స్టేడియంలో తన చిన్ననాటి స్నేహితులను కలిసి ముచ్చటించారు. ఆయన వెంట స్థానిక క్రీడాకారులు పాల్గొన్నారు.