సోమవారం 01 మార్చి 2021
Badradri-kothagudem - Jan 21, 2021 , 00:25:27

రామమందిరం నిర్మాణానికి నిధుల సేకరణ

రామమందిరం నిర్మాణానికి నిధుల సేకరణ

కేటీదొడ్డి : అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం ఆర్‌ఎస్‌ఎస్‌, వీహెచ్‌పీ, బీజెపీ కార్యకర్తలు మండల కేంద్రంలో ఇంటింటికీ తిరిగి నిధులు సేకరించారు. హిందువులు స్వచ్ఛందంగా చందాలు అందజేశారు.  నిధుల సేకరణలో రాఘవేంద్రయ్య, రాఘవ, రామకృష్ణ, మల్లీ, అశోక్‌ పాల్గొన్నారు.

అయిజ మండలంలో..

అయిజ, జనవరి 20 : అయోధ్యలో నిర్మించనున్న రామమందిర నిర్మాణానికి బీజేపీ నాయకులు నిధు లు సేకరించారు. బుధవారం మండలంలోని కొత్తపల్లి గ్రామంలో బీజేపీ నాయకులు ఆంజనేయులు గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో గ్రామస్తులతో నిధి సేకరణలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఈరన్న, ఆంజనేయులు, నాగన్న పాల్గొన్నారు. 

రాజోళి మండలంలో..

రాజోళి , జనవరి 20 : అయోధ్యలో రామమందిర నిర్మాణానికి రాజోలి జై శ్రీరామ్‌ సేవా సమితి ఆధ్వర్యంలో నిధుల సేకరణ చేపట్టారు. మండలంలోని నసనూరు, చిన్నధన్వాడ, పెద్దధన్వాడ, పెద్దతాండ్రపాడు, రాజోళి గ్రామాల్లో నిధుల సేకరణ చేపట్టారు. రాజోళిలోని ఆంజనేయస్వామి ఆలయం నుంచి రామాలయం వరకు జై శ్రీరామ్‌ నినాదాలతో భారీ ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో జైశ్రీరామ్‌ సేవా సంఘ సభ్యులు, రామభక్తులు పాల్గొన్నారు.


VIDEOS

logo