శుక్రవారం 27 నవంబర్ 2020
Badradri-kothagudem - Nov 03, 2020 , 03:19:03

యువకుడిపై పోక్సో కేసు

యువకుడిపై పోక్సో కేసు

కారేపల్లి రూరల్‌ : మాయమాటలు చెప్పి బాలికను లోబర్చుకొని వేధించిన యువకుడిపై కారేపల్లి పోలీసు స్టేషన్‌లో సోమవారం పోక్సో కేసు నమోదైంది. పోలీసులు కథనం ప్రకారం.. మండలంలోని ఓ తండాకు ఓ బాలికను కామేపల్లి మండలం పెద్దలచ్చతండాకు చెందిన పవన్‌ అనే యువకుడు పరిచయం చేసుకొని మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. ఈ విషయమై బాలిక తల్లి కారేపల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కారేపల్లి ఎస్సై సురేష్‌ పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయగా.. ఖమ్మం రూరల్‌ ఏసీపీ వెంకటరెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.