గురువారం 04 జూన్ 2020
Badradri-kothagudem - Feb 27, 2020 , 23:30:23

జర్నలిస్టు వాసు కుటుంబాన్ని ఆదుకుంటాం

జర్నలిస్టు వాసు కుటుంబాన్ని ఆదుకుంటాం

తల్లాడ: జర్నలిస్టు వాసు కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. గురువారం మండలపరిధిలోని నారాయణపురంలో వాసు దశదినకర్మలో పాల్గొన్న అనంతరం జరిగిన సంస్మరణసభలో ఆయన మాట్లాడారు. తొలుత వాసు చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం సీనియర్‌ జర్నలిస్టు గుడిపల్లి నారాయణ అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వాసు కుటుంబానికి తనవంతు రూ.లక్ష ఆర్థికసాయాన్ని అందజేస్తానన్నారు. వాసు ఎలక్ట్రానిక్‌ మీడియాలో జర్నలిస్టుగా పనిచేసి మంచి పేరు సంపాదించారన్నారు. ప్రభుత్వం నుంచి సాయం అందేలా కృషిచేస్తానన్నారు. అనంతరం టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ మాట్లాడుతూ ప్రెస్‌అకాడమీ నుంచి చైర్మన్‌ అల్లం నారాయణ రూ.లక్షను వాసు కుటుంబానికి అందించనున్నట్లు తెలిపారు. తోటి జర్నలిస్టులు అండగా నిలిచి ఆదుకోవాలన్నారు. ఈ సందర్భంగా వైరా ఎలక్ట్రానిక్‌ మీడియా, కల్లూరు ప్రింట్‌మీడియా, సత్తుపల్లి ఎలక్ట్రానిక్‌ మీడియా, టీవీ-9 జిల్లా రిపోర్టర్‌, తల్లాడ జర్నలిస్టులు రూ.1.80 లక్షలను బాధిత కుటుంబానికి అందజేశారు. అనంతరం వాసు కుమార్తె భార్గవి పేరున రూ.1.80 లక్షలను బ్యాంక్‌లో డిపాజిట్‌ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, జడ్పీటీసీ దిరిశాల ప్రమీల, టీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి ఇస్మాయిల్‌, టెంజూ అధ్యక్షుడు అడపాల నాగేందర్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులు వాసు, సాంబశివరావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్ష, కార్యదర్శులు రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, దుగ్గిదేవర వెంకట్‌లాల్‌, సర్పంచ్‌ నారపోగు వెంకటేశ్వర్లు, శీలం కోటారెడ్డి, మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మన్‌ దూపాటి భద్రరాజు, దుగ్గిదేవర అజయ్‌, ఏపూరి రాజా, దాసరి శ్రీనివాసరావు, ఎక్కిరాల శ్రీనివాసరావు, ఉప్పల ప్రభాకర్‌రావు,  తదితరులు పాల్గొన్నారు.


logo