AP News | టీడీపీ ఎన్నారై కార్యకర్త యశస్వి(యశ్) అరెస్టు ఏపీలో సంచలనం రేపింది. యశ్ అరెస్టును ఖండిస్తూ టీడీపీ నాయకులు వరుసగా ప్రకటనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించింది. ‘నీ సైకో చేష్టలు మరొక్క వంద రోజులే జగన్ రెడ్డి.. అట్టుకి, అట్టున్నర తిరిగి ఇచ్చేస్తామని టీడీపీ ట్వీట్ (ఎక్స్) చేసింది. ఈ ట్వీట్‌కు వైఎస్సాఆర్సీపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. మొత్తానికి కర్రీ పాయింట్ల పార్టీ అనిపించారని విమర్శించింది.
అట్టు అట్టున్నర.. దోసె.. దోసెన్నర.. ఆ సంగతి తర్వాత గానీ యశ్ బుర్ర మోకాల్లోనే ఉన్నట్టుందని వైఎస్సాఆర్సీపీ పార్టీ ట్విట్టర్ (ఎక్స్) ఎద్దేవా చేసింది. మీ విషయంలో, మీ కుటుంబసభ్యుల విషయంలో ఇలాగే పోస్టులు పెడితే అభినందిస్తూ దండలు వేస్తారా? అరదండలు వేస్తారా? చెప్పండని ప్రశ్నించింది. అలాంటి ఉన్మాదిని సమర్థిస్తున్నారంటే.. ఇలాంటి మానసిక ఉగ్రవాదులను టీడీపీ .. డబ్బులిచ్చి పెంచి పోషిస్తున్నట్లు అర్థమవుతోందని పేర్కొంది. యశ్ మీద పెట్టిన కేసులు మాత్రమే చూస్తున్నారని.. జగన్‌ను టార్గెట్ చేస్తూ పెట్టిన చూడలేదా? చూడలేరా? అని ప్రశ్నించింది. అంతేకాకుండా జగన్ ప్రభుత్వంపై యశ్ చేసిన పోస్టులను కూడా ట్యాగ్ చేసింది.
మొత్తానికి కర్రీపాయింట్ల పార్టీ అనిపించారు.. అట్టు.. అట్టున్నర…. దోసె .. దోసెన్నర .. ఆ సంగతి తరువాతగానీ యాష్ అనేవాడు విదేశాల్లో ఉన్నా వాడి బుర్ర మాత్రం మోకాల్లోనే ఉన్నట్లుంది. వాడి రాతలు.. చేష్టలు చూస్తే మీకే క్లారిటీ వస్తుంది. మీ విషయంలో మీ కుటుంబీకుల విషయంలో ఎవరైనా అలా… https://t.co/HiylShjpZa pic.twitter.com/3Oup5fZOPV
— YSR Congress Party (@YSRCParty) December 23, 2023