Accident in AP | ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం దుర్గి మండలం అడిగొప్పల వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నది. నాగార్జున సాగర్ కుడి కాల్వలోకి కారు దూసుకెళ్లింది. ఈ కారులో వైఎస్ఆర్సీపీకి చెందిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు మదన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఉన్నారు.
సాగర్ కాలువలోకి కారు దూసుకెళ్లిన విషయాన్ని గమనించిన స్థానికులు రంగంలోకి దిగి ఆ కారు నుంచి మదన్మోహన్ రెడ్డికి బయటకు తీశారు. ఆయన భార్య, కూతురు గల్లంతయ్యారు. వారి గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మదన్మోహన రెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మదన్ మోహనరెడ్డి.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చిన్నాన్న కొడుకు. దుర్గి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.