YSRCP | తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదివారం రుషికొండలో గత ప్రభుత్వం నిర్మించిన భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశం నిర్వహిస్తూ జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే, ఈ వ్యవహారంపై వైఎస్సార్సీపీ స్పందించింది. రుషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలేనని స్పష్టం చేసింది. రుషికొండ రిసార్ట్స్ భవనాల్లోకి వెళ్లి ఫొటోలు తీసి, పైత్యం ప్రదర్శించడంతో మీకు మానసికంగా తృప్తి కలుగుతుందేమో కానీ.. విశాఖ ప్రజలకు ఏమాత్రం మేలు జరుగదని స్పష్టం చేసింది. రుషికొండలో ఉన్నవి ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులని.. అవేమీ ప్రైవేటు ఆస్తులు కావని చెప్పింది.
ఆ భవనాలు ఎవరి సొంతం కూడా కావని.. విశాఖ నగరానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ భవనాలను నిర్మించిందని.. వాటిని ఎలా వినియోగించుకోవాలన్నది అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇష్టమని పేర్కొంది. ప్రభుత్వ భవనాల్లోకి వెళ్లి.. ఫొటోలు తీయించి.. వాటికి వక్రీకరణలు జోడించి బురద చల్లాలని ప్రయత్నించడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొంది. 1995 నుంచి కూడా విశాఖపట్నం ఆర్థిక రాజధాని అని చంద్రబాబు ఊదరగొడుతూనే ఉన్నారని.. ఇప్పటికి నాలుగు పర్యాయాలు సీఎం అయ్యారని.. విశాఖ నగరానికి రాష్ట్రపతి వచ్చినా, ప్రధానమంత్రి వచ్చినా, సీఎంలు, గవర్నర్లు వచ్చినా ఆతిథ్యం ఇచ్చేందుకు సరైన భవనం లేదన్న విషయం గుర్తించాలంటూ అధికార పార్టీకి వైఎస్సార్సీపీ సూచించింది.
రుషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలే. ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు అవి. అవేమీ ప్రైవేటు ఆస్తులు కావు. అవి ఎవరి సొంతంకూడా కాదు. విశాఖపట్నానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఈ భవనాలను నిర్మించారు. వాటిని ఎలా వినియోగించుకోవాలన్నది ప్రభుత్వం ఇష్టం. అలాంటి… https://t.co/o3m2GSOrAk
— YSR Congress Party (@YSRCParty) June 16, 2024