YSRCongress Party | త్వరలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని అధికార వైసీపీ కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే మూడు విడుతలుగా వివిధ అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ చార్జీలను నియమించిన వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్.. తాజాగా నాలుగో జాబితాను ఖరారు చేశారు. ఆ జాబితాను రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం రాత్రి మీడియాకు విడుదల చేశారు. రీజనల్ కో ఆర్డినేటర్లు, కీలక నేతలతో చర్చించిన తర్వాత ఈ జాబితా ఖరారైంది. 59 స్థానాలకు వైసీపీ ఇన్ చార్జీలను ప్రకటించింది.
జీడీ నెల్లూరు (ఎస్సీ) – ఎన్ రెడ్డప్ప
శింగనమల (ఎస్సీ) – ఎం వీరాంజనేయులు
తిరువూరు (ఎస్సీ) – నల్లగట్ల స్వామిదాస్
కొవ్వూరు (ఎస్సీ) – తలారి వెంకట్రావు
నంది కొట్కూర్ (ఎస్సీ) – సుధీర్ దార
మడకశిర (ఎస్సీ) – ఈర లక్కప్ప
కనిగిరి – దద్దాల నారాయణ యాదవ్
గోపాలపురం (ఎస్సీ)- తానేటి వనిత (హోంమంత్రి)
చిత్తూరు పార్లమెంట్ (ఎస్సీ) – కే నారాయణ స్వామి