YS Jagan | శనివారం అసెంబ్లీ సమావేశాలకు హాజరు కారాదని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. శుక్రవారం ఏపీ అసెంబ్లీ తొలి సమావేశంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్గా సభ్యులతో ప్రమాణం చేయించారు. కాగా, స్పీకర్ పదవికి టీడీపీ తరఫున నర్సీపట్నం నుంచి ఎన్నికైన చింతకాయల అయ్యన్న పాత్రుడు ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన ఏకగ్రీవంగా అసెంబ్లీ స్పీకర్గా ఎన్నికయ్యారు. శనివారం అయ్యన్న పాత్రుడు అసెంబ్లీ స్పీకర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం అసెంబ్లీ సమావేశానికి హాజరు కారాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
స్పీకర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి దూరంగా ఉండాలని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ భావిస్తున్నారని తెలియవచ్చింది. అయితే, కొత్తగా ఎన్నికైన స్పీకర్ను అధికార, విపక్ష నేతలు సభాపతి స్థానంలో కూర్చోబెట్టడం ఆనవాయితీగా వస్తున్నది. కానీ వైఎస్ జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందులకు వెళ్లాలని నిర్ణయించుకున్నారని ఆ పార్టీ వర్గాల కథనం. శనివారం ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి పులివెందులకు బయలుదేరి వెళతారు. మూడు రోజుల పాటు పులివెందులలో సాధారణ ప్రజలకు వైఎస్ జగన్ అందుబాటులో ఉంటారని ఆ పార్టీ వర్గాల కథనం.
సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత వైఎస్ జగన్.. తన సొంత నియోజకవర్గం పులివెందులకు రావడం ఇదే తొలిసారి కానున్నది. కాగా తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు పోటీ చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో జగన్ సమావేశమయ్యారు. పార్టీ కోసం పని చేసిన, నిలబడిన వాలంటీర్లను కాపాడుకోవాలని నేతలకు జగన్ పిలుపునిచ్చారు.
Oppo A3 Pro | ఒప్పో నుంచి మరో బడ్జెట్ ఫోన్ ఒప్పో ఏ3 ప్రో.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Gold-Silver Rates | భారీగా పెరిగిన బంగారం వెండి ధరలు.. యూఎస్ ఫెడ్ రిజర్వుపైనే ఆశలు..!
Petrol Rates – Goa | గోవాలో పెట్రోల్, డీజిల్ పిరం.. సామాన్యులకు బీజేపీ సర్కార్ షాక్