YS Sharmila Son | దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మనుమడు, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తనయుడు రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. తల్లికి అండగా ఉండేందుకు రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నాడని సోషల్‌మీడియాలో ప్రచారం మొదలైంది. పైగా ఇటీవల వైఎస్ షర్మిలతో కలిసి రాజారెడ్డి రైతులను పరామర్శించేందుకు వెళ్లడంతో ఈ ప్రచారం మరింత జోరందుకుంది. ఈ నేపథ్యంలో కుమారుడి పొలిటికల్ ఎంట్రీపై వైఎస్ షర్మిల కూడా క్లారిటీ ఇచ్చేశారు. అవసరమైనప్పుడు తప్పకుండా రాజకీయాల్లోకి వస్తాడని స్పష్టంచేశారు.
కర్నూలులోని రైతులను పరామర్శించేందుకు వైఎస్ షర్మిల ఇవాళ ఉల్లి మార్కెట్‌కు బయల్దేరారు. షర్మిల వెంట ఆమె కుమారుడు రాజారెడ్డి కూడా ఉన్నారు. ఈ ప్రచారానికి వెళ్లడానికి ముందు రాజారెడ్డిని తీసుకుని షర్మిల విజయమ్మ వద్దకు వెళ్లారు. అక్కడ అమ్మమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకున్న తర్వాత అమ్మ షర్మిలతో కలిసి కర్నూలు ఉల్లిమార్కెట్కు వెళ్లాడు. ఈ సందర్భంగా రాజారెడ్డిని కలిసి షర్మిల, రాజారెడ్డి బయటకు వచ్చే వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. విజయమ్మ కూడా బయటకు వచ్చి వారికి వీడ్కోలు పలకడం ఆ వీడియో ఉంది. ఈ క్రమంలోనే వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తున్నారనే ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలోనే షర్మిలను మీడియా ప్రశ్నించగా.. అవసరమైనప్పుడు ఆంధ్రా రాజకీయాల్లోకి తన కొడుకు రాజారెడ్డి తప్పకుండా వస్తారని స్పష్టం చేశారు.
వైఎస్ షర్మిలా కుమారుడు వైఎస్ రాజారెడ్డి కూడా రాజకీయాల్లోకి రాబోతున్నారా అన్న చర్చలు ఊపందుకున్నాయి. ఇవాళ ఆయన తన తల్లితో కలిసి కర్నూలు ఉల్లి మార్కెట్‌కి వెళ్లారు. ఇంట్లో అమ్మమ్మ విజయమ్మ ఆశీర్వాదం తీసుకుని తల్లితో కలిసి బయలుదేరాడు. త్వరలోనే రాజారెడ్డి రాజకీయ రంగ ప్రవేశం… pic.twitter.com/E8yttonzNW
— Kaza RajKumar (@KazaRajKumar) September 8, 2025