YS Sharmila | హత్యా రాజకీయాలకు స్వస్తి పలకాలంటే అవినాష్, జగన్‌ను ఓడించాలి : వైఎస్ షర్మిల
YS Sharmila | ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) కడప పార్లమెంట్ పరిధిలోని అమగంపల్లి నుంచి ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర ను ప్రారంభించారు.
అమరావతి : హత్యా రాజకీయాలకు స్వస్తి పలకాలంటే అవినాష్ (Avinash) ను, జగన్ (CM Jagan) ను ఎన్నికల్లో ఓడించాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) పిలుపునిచ్చారు. కడప పార్లమెంట్ పరిధిలోని అమగంపల్లి నుంచి ఎన్నికల ప్రచార బస్సుయాత్ర ( Bus Yatra ) ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైఎస్ వివేకా కూతురు సునీతతో కలిసి షర్మిల మాట్లాడారు.
వైఎస్ వివేకానంద హత్యకేసులోని నిందితుడికి మరోసారి జగన్ టికెట్ ఇచ్చారని మండిపడ్డారు. హంతకులను కాపాడుకోవడానికి జగన్ తన పదవిని వాడుకుంటున్నారని విమర్శించారు. హంతకులు చట్టసభలకు వెళ్లకూడదని తాను కడప ( Kadapa) నుంచి పోటీ చేస్తున్నానని పేర్కొన్నారు.
వైసీపీ అధికారంలోకి రాకముందు ప్రత్యేక హోదా (Special Status) తీసుకొస్తానని హామీ ఇచ్చి గద్దెను ఎక్కిన జగన్ ఐదేండ్లలో ఎందుకు తీసుకురాలేదని ఆరోపించారు. ప్రత్యేక హోదాను సాధించి ఉంటే వంద పరిశ్రమలు వచ్చేవని, దీని ద్వారా రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించేదని అన్నారు. లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరికేవని పేర్కొన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకపోవడం దురదృష్టకరమని ఆమె అన్నారు. పోలవరాన్ని పూర్తి చేయలేదని ఆరోపించారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి(Former Minister Kruparani ), రామోహ్మన్ దంపతులు వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

