YS Jagan | జగన్ ఒక్కడే రూ.2లక్షల కోట్లు దోచేశాడు.. వైసీపీపై బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
YS Jagan | వైసీపీ ఐదేళ్ల పాలనలో రూ.5లక్షల కోట్లు దోచేశారని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ ఒక్కడే రూ.2 లక్షల కోట్లను స్వాహా చేశారని విమర్శించారు. రాష్ట్రంలో ఎటు చూసినా వారు చేసిన అక్రమాలు, కబ్జాలు అనేకం వెలుగులోకి వచ్చాయని అన్నారు.
YS Jagan | వైసీపీ ఐదేళ్ల పాలనలో రూ.5లక్షల కోట్లు దోచేశారని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ ఒక్కడే రూ.2 లక్షల కోట్లను స్వాహా చేశారని విమర్శించారు. రాష్ట్రంలో ఎటు చూసినా వారు చేసిన అక్రమాలు, కబ్జాలు అనేకం వెలుగులోకి వచ్చాయని అన్నారు. వాటి నుంచి ప్రజలను మర్చలేందుకే వైసీపీ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి సున్నా అని.. త్వరలోనే వైసీపీ కూడా అదే స్థితికి రాబోతుందని ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా వైసీపీకి చెందిన నాయకులు అనేక మంది వైసీపీ నేతలంతా జైలుకు వెళ్లడం ఖాయమని హెచ్చరించారు. దస్త్రాల దహనం, కాల్వలో పారేయడం వంటి వారి దుశ్చర్యలకు నిదర్శనాలుగా అభివర్ణించారు.
జగన్ పాలనలో జరిగిన మద్యం విక్రయాల్లోనే భారీ కుంభకోణం బయటపడుతుందని తెలిపారు. వైసీపీకి రాజకీయాలు లేకుండా చేస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారనే భయంతోనే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం కల్పించారని ఆరోపించారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో కబ్జాలు, తప్పులు జరగని ప్రాంతం ఏదీ లేదని విమర్శించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- Adinarayana Reddy
- AP News
- BJP
- ycp
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

