YCP Digital Book | నారా లోకేశ్ రెడ్ బుక్ తరహాలోనే వైఎస్ జగన్ డిజిటల్ బుక్‌ను లాంఛ్ చేశారు. కూటమి పాలనలో ఇబ్బంది పడుతున్న వైసీపీ కార్యకర్తలు ఇందులో ఫిర్యాదు చేసేందుకు వైఎస్ జగన్ ఈ డిజిటల్ బుక్‌ను తీసుకొచ్చారు. ఈ మేరకు https://digitalbook.weysrcp.com/ వెబ్‌సైట్‌ను లాంఛ్ చేశారు. వైసీపీ కార్యకర్తలతో తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో జగన్ ఈ డిజిటల్ బుక్‌ను ఆవిష్కరించారు.
https://digitalbook.weysrcp.com/ వెబ్సైట్లో మొబైల్ నంబర్‌తో లాగిన అయ్యి.. ఎలాంటి అన్యాయం జరిగిన సరే ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. ఈ వెబ్‌సైట్‌తో పాటు ఐవీఆర్ఎస్ కాల్ సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. 040-49171718 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేసిన ప్రతి సంఘటనను శాశ్వత డిజిటల్ లైబ్రరీలో నమోదు చేసి భద్రపరుస్తారు. ఈ డిజిటల్ బుక్కు సంబంధించి ఒక క్యూఆర్ కోడ్‌ను కూడా వైఎస్ జగన్ లాంచ్ చేశారు. వెబ్సైట్లోకి వెళ్లి సమస్యలపై ఫిర్యాదు చేయలేని వాళ్లు.. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తమ సమస్యలకు సంబంధించిన వీడియో అప్లోడ్ చేయవచ్చు.
ఇలా వచ్చిన ఫిర్యాదులు అన్నింటిపైనా అధికారంలోకి వచ్చిన తర్వాత కచ్చితంగా చర్యలు ఉంటాయని వైఎస్ జగన్ వివరించారని వైసీపీ నేతలు, కార్యకర్తలు తెలిపాయి. అన్యాయం చేసిన వారు ఎక్కడున్నా సరే తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టే చర్యలు ఉంటాయని జగన్ చెప్పారన్నారు. ఈ విస్తృత స్థాయి సమావేశంలో భాగంగా గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అందుకు వైసీపీ సిద్ధంగా ఉందని నేతలు స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే.. కూటమి ప్రభుత్వ వేధింపులపై రెడ్‌బుక్ తరహాలో ఒక యాప్‌ను తీసుకొస్తామని గతంలో వైఎస్ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘ వైసీపీలో చురుగ్గా ఉండే నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. ప్రతి కార్యకర్త కష్టాన్ని చూస్తున్నాం. ఆ అన్యాయాలు చేసిన వారికి సినిమాలు చూపిస్తాం. రిటైర్డ్ అయిన వారికి లాక్కొస్తాం. దేశం విడిచిపెట్టి వెళ్లినా సరే, సప్త సముద్రాల అవతల ఉన్నా సరే రప్పిస్తాం.’ అన్ని అప్పట్లో వార్నింగ్ ఇచ్చారు. ఆ మాట ప్రకారమే ఇప్పుడు డిజిటల్ బుక్‌ను ఆవిష్కరించారు.
పార్టీ కార్యకర్తలకి అండగా నిలిచేందుకు.. డిజిటల్ బుక్ తీసుకొచ్చిన వైయస్ఆర్ సీపీ
ఈరోజు వైయస్ జగన్ గారి చేతుల మీదుగా డిజిటల్ బుక్ ప్రారంభం
Today, the Digital Book was launched by YSRCP Chief Shri @ysjagan.
Link 🔗👇🏻https://t.co/zJyelqwmsq#YSJagan pic.twitter.com/tE56MexDPg
— YSR Congress Party (@YSRCParty) September 24, 2025