అమరావతి : ఆక్వాఫీడ్ ధరలు(Aquafeed prices) తగ్గించాల్సిందేనని లేదంటే ఆక్వా రైతులతో కలిసి ఉద్యమిస్తామని ఏపీలోని కూటమి ప్రభుత్వానికి మాజీ సీఎం వైఎస్ జగన్ హెచ్చరించారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో జగన్తో ఆక్వా రైతులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ..వైసీపీ హయాంలో ఆక్వా రైతుల కోసం ఎంతో కృషి చేశామన్నారు.
కానీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. నేడు రైతులు ఏపీలో దర్భరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన ఆక్వాఫీడ్ ధరల్ని ఈ నెలాఖరులోగా తగ్గించాలని, లేదంటే రైతుల తరఫున పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైతులకు వైసీపీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.