Love Affair| ప్రేమించలేదని.. ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు
ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా నందికొట్కూరులో దారణం చోటుచేసుకున్నది. ప్రేమించలేదనే (Love Affair) కారణంతో ఇంట్లో నిద్రిస్తున్న ఇంటర్ విద్యార్థినిపై ఓ ప్రేమోన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అరవకుండా ఆమె నోట్లో బట్టలు కుక్కాడు.
నంద్యాల: ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా నందికొట్కూరులో దారణం చోటుచేసుకున్నది. ప్రేమించలేదనే (Love Affair) కారణంతో ఇంట్లో నిద్రిస్తున్న ఇంటర్ విద్యార్థినిపై ఓ ప్రేమోన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అరవకుండా ఆమె నోట్లో బట్టలు కుక్కాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. అనంతరం తాను కూడా నిప్పంటుకున్నాడు. అయితే గమనించిన స్థానికులు మంటలు ఆర్పి అతడికి దేహశుద్ధి చేశారు. అయితే వారినుంచి తప్పించుకున్న యువకుడు.. చికిత్స నిమిత్తం దవాఖానలో చేరాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, బాలికను లహరిగా గుర్తించారు. ఆమె స్వస్థలం వెల్దుర్తి మండలం రామళ్లకోట అని, తండ్రి చనిపోవడంతో నందికొట్కూరులోని బైరెడ్డి నగర్లో ఉంటున్న అమ్మమ్మ ఇంట్లో ఉంటూ చదువుకుంటున్నట్లు తెలుస్తున్నది. నిందితుడిని కొలిమిగుండ్లకు చెందిన రాఘవేంద్రగా గుర్తించారు. అతడు గత కొంత కాలంగా లహరిని ప్రేమిస్తున్నాని వేధిస్తున్నట్లు సమాచారం.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

