అమరావతి : కేంద్రంలో ప్రస్తుతం వైసీపీ వైఖరి తటస్థంగా ఉందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) పేర్కొన్నారు. ఇండియా(INDIA) కూటమికి గాని, ఎన్డీయే (NDA) కూటమికి సమాంతర దూరంలో ఉన్నామని వెల్లడించారు. ఈనెల 27న ఏపీ లో విద్యుత్ చార్జీల (Electricity Bills) పెంపుదలను నిరసిస్తూ తలపెట్టిన పోరుబాట పోస్టర్‌ను మంగళవారం విశాఖలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్తో కలిసి మీడియాతో మాట్లాడారు. తాము మొదటి నుంచి న్యూట్రల్‌గానే ఉన్నామని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని అన్నారు. జమిలి ఎన్నికలు వస్తాయని వైసీపీ ముందునుంచే చెబుతుందని అన్నారు. గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చిన కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత రూ. 15 వేల కోట్లకు పైగా విద్యుత్ ఛార్జీలు పెంచిందని ఆరోపించారు.
వచ్చే నెల నుంచి రూపాయిన్నర వరకు యూనిట్‌పై భారం పడుతుందని అన్నారు. నాణ్యమైన విద్యుత్ , విద్య, వైద్యాన్ని అందిస్తామని చెప్పి నాణ్యమైన మద్యాన్ని అందజేస్తుందని విమర్శించారు.