అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు వస్తున్న ప్రజాధారణను చూసి టీడీపీ ఓర్వలేక పోతుందని వైసీపీ మహిళా ఎమ్మెల్సీలు కల్యాణి, పోతుల సునిత ఆరోపించారు. ఇవాళ వేర్వేరుగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై, అతడి కుటుంబ సభ్యులపై తీవ్రంగా విరుచుకు పడ్డారు. టీడీపీ ప్రభుత్వహయాంలో మద్యం స్పై రెడ్డి డిస్టిలరీ నుంచి విక్రయాల్లో చంద్రబాబు భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు.
జగన్ సతీమణి వైఎస్ భారతి ఏ రోజు కూడా రాజకీయాలు మాట్లాడలేదని, ఆమె గురించి ఎవరైనా ఏమైనా మాట్లాడితే నాలుక కోస్తామని హెచ్చరించారు. రెండెకరాలు ఉన్న చంద్రబాబు రెండు లక్షల కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలోనే డిస్టిలరీలు, బ్రూవరీలకు ఇష్టారీతిన అనుమతులిచ్చారని మద్యాన్ని ఏరులై పారించారని పేర్కొన్నారు. బీ-3 బ్రాండ్లు అంటే భువనేశ్వరి, బ్రాహ్మణి, బాబు అని వ్యాఖ్యనించారు. భూవనేశ్వరి, బ్రాహ్మణి లిక్కర్ వ్యాపారం చేశారని విమర్శించారు.