YCP Protests | ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరతపై రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నిరసనలు
YCP Protests | పెట్రోల్, డీజిల్ కొరతపై ఏపీలో వైసీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నిరసనలు తెలిపారు.
అమరావతి : పెట్రోల్, డీజిల్ కొరతపై ఏపీలో వైసీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నిరసనలు (YCP Protests ) తెలిపారు. పెట్రోల్ ( Petroll ) , డీజిల్ ( Diesel ) దొరక్క వాహనదారులు, రైతులు అల్లాడుతుంటే కనీసం కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ రోడ్లపై నిరసనలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అసమర్థతని నిలదీస్తూ ఛలో పెట్రోల్ బంక్కార్యక్రమాలను నిర్వహించింది.
తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అసమర్థతని ప్రశ్నిస్తూ ఎడ్ల బండితో నిరసన తెలిపారు. బంకులతో కూటమి నేతలు లాలూచి పడ్డారని ఆరోపించారు. బంక్‌ల వద్ద మూడు రోజుల నుంచి ఇంధనం కోసం బారులు తీరినా చీమకుట్టినట్లయినా ప్రభుత్వానికి లేదని విమర్శించారు.
కాగా వైసీపీ ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పెట్రోల్, డీజిల్ సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. రాష్ట్రంలో బంక్ యజమానులతో కూటమి నేతలు కుమ్మక్కై కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. అన్నిచోట్లా బంకుల వద్ద ‘ నో స్టాక్’ బోర్డులు వెలిశాయని కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని, రాష్ట్రంలో ఇంధన సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

