అమరావతి : ఏపీలో ప్రధాన పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధుల రాజీనామాల పర్వం కొనసాగుతుంది. తాజాగా వైసీపీకి చెందిన కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ (MP Sanjeev Kumar ) రాజీనామా చేశారు. ఏ పార్టీలో చేరే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తానని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాబోయే ఎన్నికల్లో అభ్యర్థుల మార్పు భారీ ఎత్తున చేపట్టడంతో అవకాశాలు రాని నేతలు పార్టీలు మారుతున్నారు. ఇందులో కర్నూలు (Kurnool) పార్లమెంట్ పార్టీ ఇన్చార్జి పదవి నుంచి తప్పించి మంత్రి జయరాం (Minister Jayaram) కు అప్పగించడం పట్ల ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.
దీంతో బుధవారం వైసీపీ సభ్యత్వానికి , ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన పరిధిలో పార్టీ కోసం అహర్నిశలు కృషి చేశానని అన్నారు. వైసీపీలో వలసలు ఆగాలంటే పై స్థాయిలో నిర్ణయం తీసుకోవాలని సూచించారు. వైఎస్ జగన్ అపాయింట్మెంట్( YS Jagan appointment) కోరితే ఎందుకు కష్టపడతావని అనడం తనను బాధించిందని అన్నారు. గడిచిన ఐదేండ్లలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయించలేక పోయానని వెల్లడించారు. వైసీపీలో కొనసాగుతూ పనులు చేయలేననేది తన అభిప్రాయమని పేర్కొన్నారు.