అమరావతి : ఏపీ మద్యం పాలసీ కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న వైసీపీ రాజంపేట ఎంపీ( YCP MP) మిథున్‌రెడ్డికి (Mithun Reddy ) ఏసీబీ కోర్టు రిమాండ్( Ramand) విధించింది. విజయవాడలోని సిట్ కార్యాలయంలో శనివారం ఆయనను దాదాపు 7 గంటలపాటు ప్రశ్నించాక అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన అరెస్టుకు సంబంధించిన సమాచారాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు.
ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం మిథున్‌రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్‌ను ఏపీ హైకోర్టు ఇప్పటికే కొట్టేసింది. చివరికి సుప్రీంకోర్టులోనూ ఆయనకు ఊరట లభించలేదు. ఆదివారం ఏసీబీ కోర్టు ఆగస్టు 1వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో జైలు అధికారులు మిథున్‌రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 12మంది అరెస్ట్ అయ్యారు. వైసీపీలో కీలక నాయకుడిగా ఉన్న మాజీ మంత్రి తనయుడు మిథున్ రెడ్డి అరెస్టు, రిమాండ్‌తో ఆ పార్టీ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది.