 
                                                            అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ శ్రేణుల దాడుల ( TDP attacks) పై వైసీపీ ఎంపీలు(YCP MPs) రాష్ట్రపతి ముర్ముకు ఫిర్యాదు చేశారు. ఏపీలో శాంతి భద్రతలను పరిరక్షించాలని రాష్ట్రపతి (President) ని కోరినట్లు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి (Vijaya saireddy) మీడియా సమావేశంలో పేర్కొన్నారు. వారం రోజులుగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడులకు తెగబడుతున్నాయని వెల్లడించారు. ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆరోపించారు.
ప్రమాణ స్వీకారానికి ముందే చంద్రబాబు(Chandra Babu) హింసను ప్రేరేపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు . ఏపీలో చట్టం లేదు. స్వేచ్ఛ లేదు. అన్యాయమే రాజ్యమేలుతోందని వాపోయారు. కనీసం ఫిర్యాదు చేస్తామన్న కూడా పోలీసులు ఫిర్యాదులు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థ నీరుగారి పోయిందని, నిస్తేజంగా మారిపోయిందని ఆరోపించారు.
బాధితులు ఆక్రందనలను తెలుసుకోవాలని చంద్రబాబుకు సూచించారు. వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఏపీలో టీడీపీ దాడులపై చర్యలు తీసుకోకపోతే న్యాయపోరాటం చేస్తామని అన్నారు. ఫలితాల అనంతరం జరిగిన దాడుల్లో ఇద్దరు వైసీపీ కార్యకర్తలు చనిపోయారని, రాష్ట్రంలో రాక్షసపాలన మొదలైందని విమర్శించారు. టీడీపీ దాడులపై ప్రధాని, హోంమంత్రి, ఎన్హెచ్ఆర్సీకి కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు.
 
                            